ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడను ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరుల మధ్య కొత్త రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి నివేదించింది. విభజన తర్వాత ఆంధ్ర, రాయలసీమతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. పదేళ్ళలోపు సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని నిర్మిస్తారు. అయితే, 10 యేళ్లు గడువు ఇచ్చినా, సాధారణంగా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లలోపే పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సీమాంధ్ర భౌగోళికంగా చాలా పొడవుగా ఉంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చూస్తే దూరం చాలా ఎక్కువ. రాజధాని ఏర్పాటుకు అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాలతో రవాణ వసతులను పరిగణనలోకి తీసుకుని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు.
వీటన్నింటిని చూస్తే విజయవాడను ఎంపిక చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విశాఖ పట్టణం హైదరాబాద్ తర్వాత ఎక్కువగా అభివృద్ధి చెందిన నగరం కూడా ఇదే. ఇక్కడ పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు కూడా ఉన్నాయి. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ వేలాది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది.
రెండు నగరాలు పెద్దవి. రైల్వే స్టేషన్లూ పెద్దవే. నీటి లభ్యత సమస్య లేకుండా పక్కనే కృష్ణా నది ఉంది. గన్నవరంలో విమానాశ్రయం ఉంది. ఇది ఇప్పటికే వ్యాపార రాజధానిగా ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. పైగా ఇక్కడ రాజధాని ఏర్పాటుతో జంట నగరాలుగా వృద్ధి చెందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Wednesday, July 31, 2013
Friday, July 26, 2013
ఆంధ్రప్రదేశ్‌ను తుంచేస్తున్నాం... తెలంగాణ ఇచ్చేస్తున్నాం... కాచుకోండి..!!
మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, సమైక్య సెగలతో రగిలిపోతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమస్యకు చరమగీతం పాడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సరంజామా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని సీమాంధ్ర మంత్రుల వద్ద సూచనప్రాయంగా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన అంశం లేదా సమైక్యం అన్నది ప్రజల్లో ఎంతమేరకు ఉన్నదన్నది ప్రశ్నార్థకంగానే మారింది. ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. ఏ పార్టీకాపార్టీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉన్న నేపధ్యంలో తెలంగాణ సమస్య తలనొప్పిని వదిలించుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇదిలావుండగా తెలంగాణ ఏర్పాటు తథ్యం అని తేలిన నేపధ్యంలో సీమాంధ్ర నాయకులు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లం రాజులను పంపి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అడిగేందుకు దూతలకు పంపనున్నారు. మరి సోనియా గాంధీ వారి విన్నపాన్ని ఆలకించి సమైక్యానికి ఓకే అంటారో విభజన తప్పదని తేల్చి చెపుతారో చూడాలి.

శిఖర్ ధావన్ సెంచరీ : కష్టాల నుంచి గట్టెక్కిన టీమిండియా
సెన్సేషనల్ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోమారు బ్యాట్‌కు పనిచెప్పాడు. జింబాబ్వేతో రెండో వన్డేలో బౌలర్లను చితకబాదిన ధావన్ (100 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఈ ఢిల్లీ డైనమైట్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.
కాగా, 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ధావన్ తన సమయోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ధావన్‌కు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (64 బ్యాటింగ్) సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించడం విశేషం. దీంతో, భారత్ 40.3 ఓవర్లలో 214 పరుగులు చేసింది.

రాష్ట్ర విభజనపై కేంద్రం తుది నిర్ణయం: రాష్ట్రానికి బలగాలు?
రాష్ట్ర విభజనపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న తరుణలో సీమాంధ్ర ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను సీమాంధ్ర ప్రాంతంలో పాటు హైదరాబాదుకు కూడా పంపించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో అదనపు పారామిలిటరీ బలగాల తరలింపునకు రంగం సిద్ధం కావడం గమనార్హం.
సీమాంధ్ర జిల్లాలకు 15 కంపెనీలను కేటాయించగా, హైదరాబాద్ లో 10 కంపెనీలను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తథ్యమన్న సంకేతాలు బలపడుతున్నాయి.
ఇక సీమాంధ్రలో ఎక్కువ బలగాలను మోహరించనుండటంతో విభజన దిశగానే నిర్ణయమా? అనే అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రానికి 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

అనాథాశ్రమ బాలికలపై లైంగిక వేధింపులు...!
నేటి సమాజంలో ఆడది కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరులో అనాథ శరణాలయం నిర్వహిస్తున్న ఓ కొరియన్ అక్కడ ఆశ్రమమం పొందుతున్న మైనర్ బాలికలు, యువతులపై తరచు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ దళిత యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది.
తాను మూడేళ్లు ఉన్నప్పుడు ఇక్కడికొచ్చానని అయితే తొమ్మిదేళ్లున్నప్పటి నుంచే ఆశ్రమం నిర్వాహకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 18 ఏళ్లు. కేవలం తాను మాత్రమే కాకుండా ఆశ్రమంలో ఎంతోమంది ఆ నీచుడి కామవాంఛకు బలవుతున్నారని యువతి ఆవేద వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Subscribe to:
Posts (Atom)