రాష్ట్ర విభజనపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న తరుణలో సీమాంధ్ర ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను సీమాంధ్ర ప్రాంతంలో పాటు హైదరాబాదుకు కూడా పంపించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో అదనపు పారామిలిటరీ బలగాల తరలింపునకు రంగం సిద్ధం కావడం గమనార్హం.
సీమాంధ్ర జిల్లాలకు 15 కంపెనీలను కేటాయించగా, హైదరాబాద్ లో 10 కంపెనీలను వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తథ్యమన్న సంకేతాలు బలపడుతున్నాయి.
ఇక సీమాంధ్రలో ఎక్కువ బలగాలను మోహరించనుండటంతో విభజన దిశగానే నిర్ణయమా? అనే అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రానికి 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.