Friday, July 26, 2013

శిఖర్ ధావన్ సెంచరీ : కష్టాల నుంచి గట్టెక్కిన టీమిండియా

సెన్సేషనల్ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోమారు బ్యాట్‌కు పనిచెప్పాడు. జింబాబ్వేతో రెండో వన్డేలో బౌలర్లను చితకబాదిన ధావన్ (100 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఈ ఢిల్లీ డైనమైట్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.

కాగా, 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ధావన్ తన సమయోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ధావన్‌కు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (64 బ్యాటింగ్) సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించడం విశేషం. దీంతో, భారత్ 40.3 ఓవర్లలో 214 పరుగులు చేసింది.