నేటి సమాజంలో ఆడది కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరులో అనాథ శరణాలయం నిర్వహిస్తున్న ఓ కొరియన్ అక్కడ ఆశ్రమమం పొందుతున్న మైనర్ బాలికలు, యువతులపై తరచు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ దళిత యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది.
తాను మూడేళ్లు ఉన్నప్పుడు ఇక్కడికొచ్చానని అయితే తొమ్మిదేళ్లున్నప్పటి నుంచే ఆశ్రమం నిర్వాహకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 18 ఏళ్లు. కేవలం తాను మాత్రమే కాకుండా ఆశ్రమంలో ఎంతోమంది ఆ నీచుడి కామవాంఛకు బలవుతున్నారని యువతి ఆవేద వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.