Wednesday, July 17, 2013

యుటిగా హైదరాబాదా.. పుకార్లపై స్పందించం: దిగ్విజయ్

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేశారు. యుటిగా హైదరాబాద్‌ను చేస్తారనే విషయంపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. పుకార్లపై తాను ఏమీ చెప్పలేనన్నారు.

ఇక తెలంగాణపై పార్టీ కోర్ గ్రూప్ సమావేశంలో చర్చించిన విషయాలను వెల్లడించబోమని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కోర్ గ్రూప్ అంతర్గత విషయాలను వెల్లడించలేమని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

కాగా దిగ్విజయ్ సింగ్‌తో రాయపాటి మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనీ, సీమాంధ్రలో పరిస్థితి దారుణంగా ఉంటుందని దిగ్విజయ్ సింగ్‌తో చెప్పినట్లు వివరించారు.