Wednesday, July 17, 2013

పిల్లలు చదివి చదివి అలసిపోయారా.. అయితే నీళ్లు తాగండి!

ఇదేంటి అనుకుంటున్నారా.. పని ఒత్తిడిలో సతమతమైపోతున్నారా.. చదివి చదివి అలసిపోయారా.. అయితే శుభ్రంగా నీళ్లు తాగండి.. ఉత్సాహం అదంతట అదే వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

న్యూయార్క్‌లో జరిపిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా నీరు తాగని వారికంటే, ముప్పావు లీటరు నీరు తాగినవారు పరీక్షలను సూపర్‌గా రాశారని పరిశోధన తేల్చింది.

ఈ పరిశోధనలో భాగంగా కొందరు విద్యార్థులకు ఓ పరీక్ష పెట్టారు. కంప్యూటర్ స్క్రీన్ మీద వస్తువు కనిపించగానే వాళ్లు ఓ బటన్ నొక్కాలి. అయితే నీరు తాగినవారు చక్కగా స్పందించి చకచకా నొక్కగా, తాగనివారు ఆలస్యంగా స్పందించారట. సో నీరు తాగండి.. ఉత్సాహంగా ఉండండి అంటున్నారు శాస్త్రవేత్తలు.