ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.
అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవావతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.