తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం పీటీఐతో తెలిపారు. ఢిల్లిలో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ షిండే తెలంగాణపై త్వరలో నిర్ణయముంటుందన్నారు. అయితే అది పార్లమెంట్ సమావేశాలకు ముందా తర్వాత అనేది తెలియాల్సి వుందని షిండే వ్యాఖ్యానించారు.
కాగా, జమ్మూ కాశ్మీర్ లోని రామ్ బన్‌లో జరిగిన కాల్పుల ఘటనపై షిండే విచారణకు ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిటన్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆందోళకారులపై బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. కొంతమంది గాయపడ్డారు.