Thursday, July 18, 2013

పంచాయతీ ఎన్నికలు : హత్యలకు దారితీస్తున్న వర్గపోరు!

పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలు జిల్లాల్లో హత్యలకు దారి తీస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్ మోహన్ హత్య జరిగింది.

ఈ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుడు రెడ్డిరాజు హత్యకు గురయ్యాడు.

ఈయన హత్యకు కాంగ్రెస్ వర్గీయులే చేయించారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. రెడ్డిరాజును హత్య చేయడాన్ని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి తీవ్రంగా ఖండించారు. హత్య రాజకీయాలతో విజయం సాధించాలనుకోవడం అవివేకమైన చర్యగా ఆయన అభివర్ణించారు.