Thursday, July 18, 2013

పాకిస్తాన్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు!

పాకిస్తాన్‌లోని హిందువులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. సాధారణంగా సున్నీయేతర ముస్లింలను చిన్న చూపు చూసే పాకిస్తాన్‌లో.. ఇటీవలి కాలంలో ఇక్కడ నివశిస్తున్న హిందువులు, క్రిస్టియన్లు, షియా తెగలకు చెందిన ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 'యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్ సీఐఆర్ఎఫ్)' అనే సంస్థ వెల్లడించింది. పలు దేశాల్లో మత స్వేచ్ఛపై ఈ సంస్థ పరిశోధనలు చేపడుతుంది. పాకిస్తాన్‌లో గడచిన ఏడాదిన్నర కాలంలో మతపరమైన దాడులు 203 జరుగగా, అందులో 700 మంది మరణించారు. మరో 1100 మంది గాయపడ్డారు.

ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యం చేసుకుని ఆత్మాహుతి దాడులు జరుగుతుండగా, ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసుకుని జరుగుతున్న దాడులు ఎక్కువ అయినట్టు చెప్పారు. ఫలితంగా హిందువులతో సహా ఇక్కడ నివసించే సిక్కు ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.