ప్రతి మనిషికి గిలిగింతలు పెడితే పట్టలేని నవ్వు వస్తుంది. వాస్తవానికి మనిషి శరీరంలో ఎన్నో అవయవాలు, అవయవ భాగాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే సున్నితమైన భాగాలుగా ఉన్నాయి. మరికొన్ని ప్రాణప్రదమైనవిగా చెపుతారు.
అయితే ముఖ్యమైన అవయవాలుండే భాగాల్లో బయట నుంచి ఎలాంటి స్పర్శ, లేదా ఒత్తిడి కలిగినా దానికి వెంటనే స్పందించి, నిరోధించే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆయా భాగాల్లో నాడీతంత్రులు బాగా విస్తారంగా ఉంటాయి.
అందువల్లనే ఇతరులు ముట్టుకోగానే కితకితల రూపంలో మెదడుకు సందేశాలు అందుతాయి. ఆ స్పర్శ, ఒత్తిడులను నివారించేందుకు మెదడు మన శరీరాన్ని పురికొల్పుతుంది. అందువల్లనే మనం చటుక్కున నవ్వుతూ తప్పించుకోడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.