Sunday, July 21, 2013

హైదరాబాద్‌‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్న చైనా

హైదరాబాద్‌లో భారీ ఎత్తున చైనా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడులు వివిధ రంగాల్లో 160 బిలియన్ డాలర్ల మేరకు ఉండనున్నాయి. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పెట్టుబడులు చైనా పెట్టనుంది.

భారత రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ ఇటీవల బీజింగ్ పర్యటన జరిపిన విషయం తెల్సిందే. ఈ చర్చల్లో మంత్రుల హోదాలో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం చైనా తన పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది.

ఇందుకు సంబంధించిన చర్చలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చైనా ప్రధాని ఆర్థిక సలహాదారు షూసన్ జరిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, చిన్న తరహా పరిశ్రమలు, విద్య తదితర రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టనున్నట్టు సమాచారం.