Thursday, July 18, 2013

షర్మిల పాదయాత్ర : 212 రోజులు... 2835.6 కిలోమీటర్లు

వైఎస్. షర్మిల చేపట్టి మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోంది. ఈ యాత్ర ద్వారా ఆమె ఇప్పటికే సరికొత్త రికార్డును సృష్టించారు. వేల కిలోమీటర్లు నడిచిన ఒక మహిళగా షర్మిల ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా సాధించిన రికార్డును ఆమె తిరగరాశారు. షర్మిల మరో ప్రజా ప్రస్థాన యాత్ర బుధవారం ముగిసే సమయానికి 212 రోజులు పూర్తి చేసుకోగా, ఆమె ఏకంగా 2835.6 కిలోమీటర్ల మేరకు నడిచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మరికొన్ని రోజులు ఓపిక పట్టండి.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది.. ఈ ప్రభుత్వం పోతుంది.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలకు జగనన్న మళ్లీ జీవం పోస్తారు. నాటి సువర్ణయుగాన్ని తిరిగి తెస్తారు.. అంతవరకు ఓపిక పట్టాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ యాత్ర విజయనగరం జిల్లాలో సాగుతోంది.