* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
* నిద్రలేమితో బాధపడుతుంటే ఒక గ్లాసు వేడిపాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి తాగాలి.
* నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాలసేపు పాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్ధన చేయాలి.
* నిద్రలేమి శరీరంలో హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. హార్మోన్ల స్ధాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు మెటబాలిజమ్ వేగం తగ్గుతుంది. మంచి నిద్ర కణాల పుననిర్మాణాన్ని, బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.