సీమాంధ్ర నేతలకు టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఒక విజ్ఞప్తి చేశారు. తమను రెచ్చగొట్టవద్దని ఆయన కోరారు. తమను రెచ్చగొట్టడం వల్ల అనేక మంది యువకులు నిగ్రహం కోల్పోయి రెచ్చిపోతే వారిని ఆపడం ఎవరితరం కాదన్నారు.
సచివాలయంలో కొన్ని కీలక దస్తావేజులను తగులబెడుతున్నట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోదండరాం మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న తమను రెచ్చగొట్టవద్దని కోరారు. సెక్రటేరియట్‌లో దస్త్రాలు తగులబెడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.
ఇకపోతే రాష్ట్ర విభజనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాష్ట్రాన్ని తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.