వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం తుడ్డలి నుంచి ప్రారంభమైంది.
బుధవారంతో 219వ రోజుకు చేరిన పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ పాదయాత్ర మర్రిపాడు, లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనపురం, బూర్జా క్రాస్ రోడ్స్, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస, వైకుంఠపురం మీదుగా కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.