రాష్ట్ర విభజన అనివార్యమయ్యే పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకించి వర్కింగ్ కమిటీ కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయన దానిని మౌనంగా ఆమోదిస్తారా?లేక తన పదవికి రాజీనామా చేస్తారా అన్నది ఈ చర్చల సారాంశంగా ఉంది.
కోర్ కమిటీ సమావేశం నాడు తెలంగాణకు అనుకూలంగా కమిటీ ఉంటే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత అవన్నీ నిజం కాదని తాను హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, రాజీనామా వార్తలన్నీ ఊహాగానాలనేనని సీఎం స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అయినప్పట్టికీ గట్టి సమైక్యవాదిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే అధిష్టానానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?అన్నది ప్రశ్నగా ఉంది. మరి హైకమాండ్ నిర్ణయానికి సీఎం కట్టుబడుతారా.. లేక తన పదవికి రాజీనామా చేస్తారనేది వేచి చూడాలి.