Tuesday, March 3, 2009

ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది: కోనేరు

న్యూస్ ఇండియా బ్యూరో

ఎస్సీల వర్గీకరణ జరిగి తీరుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కోనేరు రంగారావు పేర్కొన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం తాము చేయాల్సిందంతా చేశామని, అయితే జాప్యం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు మాణిక్య వరప్రసాద్, గంగారాంలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై కేంద్రంలో వివిధ స్థాయిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న కారణంగానే ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు.

అలాగే సాంకేతిక కారణలవల్లే గత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం వీలుకాలేదని ఆయన అన్నారు. వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఈ విషయంలో ఆయన చేయాల్సిందంతా చేశారని కోనేరు పేర్కొన్నారు.