న్యూస్ ఇండియా బ్యూరో
భారత పార్లమెంటుకు ఏప్రిల్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇక్కడి ప్రభుత్వం, ప్రజలు ఎలా జరుపుతారనేదానిపై ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొన్ని దేశాలు తమ బృందాల్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌లో అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. భారతదేశంలో ఎన్నికల కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలని, తమను ఆ దేశం తీసుకెళ్లమని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 40 మంది బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సఫ్రాన్ ఛేజ్ అనే ప్రజా సంబంధాల సంస్థను కోరారు. దీంత ఆ సంస్థ గత వారం ఒక సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించి కొన్ని అంశాలను వివరించింది.
ఇలావుండగా మరికొన్ని దేశాల ప్రజలు ఆయా దేశాధినేతలకు తమ కోరికను వెలిబుచ్చారు. దీనిపై పలు దేశాలు స్పందిస్తూ భారత దేశానికి వారిని పంపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.