వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానిక కలర్ టీవీని అందజేస్తామని తెలుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమగ్ర ఆరోగ్య పథాకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా జ్వరం నుంచి గుండె జబ్బులకు ఉచిత వైద్య సహాయం అందిస్తామని వెల్లడించారు.

తెదేపా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ఆయన గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మేనిఫెస్టోలో ఇంకా, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళల పేరిట బ్యాంకు ఖాతా తెరిచి నెలకు ప్రతి ఒక్కరికీ రూ.1500 చోప్పున నగదు చెల్లిస్తామని చెప్పారు. అలాగే, నిరు పేదలకు నెలకు రూ.2000, పేదలకు రూ.1500, మధ్య తరగతి కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
అలాగే, రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా వెన్న బెల్టు షాపులను పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరుగుతోందని, అలాగే, రాష్ట్రంలోని పేద ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.