తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం సమస్య ఉత్పన్నమవుతుందని పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత జి. వివేక్ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నక్సలిజానికి సీమాంధ్ర ప్రాంతమే పుట్టినల్లు, తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం మరింతగా పెరుగుతుందని మంత్రి షిండేకు తెలిపినట్టు వివేక్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎంపీ వివేక్ తాజాగా సుశీల్ కుమార్ షిండేతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.