Thursday, March 5, 2009

చిత్తశుద్ధి లేకే తెలంగాణ రాలేదు: చిరంజీవి

న్యూస్ ఇండియా బ్యూరో

నేతల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటే సౌలభ్యం కోసం అన్నదమ్ములు విడిపోవడంలాంటిదేనని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రజారాజ్యం కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చిరంజీవి పై వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంలో ఆంధ్రలో ఎలాంటి వ్యతిరేకతా లేదని చిరంజీవి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంలో ప్రజారాజ్యంకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్, పెద్దిరెడ్డిలు తమ పార్టీలో కలిశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్చి 10న జరగనున్న సామాజిక న్యాయ శంఖారావం పోస్టరును చిరంజీవి విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా టీడీపీకి చెందిన భట్టి జగపతి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగపతి మాట్లాడుతూ చిరంజీవి ప్రతిపాదించిన సామాజిక న్యాయం నచ్చి ప్రజారాజ్యంలో చేరినట్టు పేర్కొన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కూడా గురువారం ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి నటించిన ఆపద్భాందవుడు చిత్రంలో తాను ఆయనకు తండ్రిగా నటించానని పార్టీలోనూ అలాంటి పాత్రే పోషిస్తానని పేర్కొన్నారు.