బీజేపీ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమది ప్రాంతీయ పార్టీ స్థాయి కాదని, టీడీపీనే కుటుంబస్థాయి పార్టీగా దిగజారిందని బీజేపీ విమర్శించింది.

ఈ విషయమై బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతో టీఆర్ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తమను విమర్శించడం తగదని పేర్కొన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మే స్థితిలోలేరని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల స్థాయికి పడిపోయాయని వాటికి దేశం మొత్తంగా బలమేమీ లేదని పేర్కొన్నారు.